మిడ్ నైట్ కాఫీ కథ
హాల్ లోని నిశ్శబ్డానికి క్లాక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ మాత్రమే వినిపిస్తుంది. రోజంతా అది ఆలా సౌండ్ చేస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు వినపడదు. కానీ ఈ టైం లో... ప్రపంచం అంత పడుకున్నాక, ఉన్నవాళ్ళకి మాత్రమే అది చేసే చప్పుడు, అది చెప్పే మాటలు వినపడతాయి.
కాసేపు రిలాక్స్ అవుతూ ఒక కాఫీ తాగితే ఎలా ఉంటుంది అనిపించింది. కిచెన్ లోకి వెళ్లి stove వెలిగిస్తే lighter సౌండ్ ఏదో gun పేల్చినంత గట్టిగ వినిపించింది. ఎంత మెల్లగా try చేసిన , పాత్రలు చేస్తున్న sound ఆపలేకపోతున్న.మెల్లగా ఎలాగోలా కప్ లో కాఫీ వేస్కుని ఆ గడియారం చప్పుడు వింటూ, ఏదో ఆర్కెస్ట్రా ఎంజాయ్ చేసినట్టు ఫీల్ అయిపోయా.